ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని కులాలుంటేనే రాజధాని: జగన్‌

ABN, First Publish Date - 2020-12-25T21:10:32+05:30

జిల్లాలోని కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జిల్లాలోని కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అలాగే నవరత్నాలు- పేదలకు ఇళ్లు పథకాన్ని జగన్‌ ప్రారంభించారు. 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో సెంటు భూమిని ప్రభుత్వం కేటాయించింది. 68,361 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో ప్రభుత్వం ఇవ్వనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 



అన్ని కులాలు, మతాలు ఉంటేనే అది రాజధాని అవుతుందని.. ఫలాన కులం, మతం వారు ఇక్కడ ఉండొద్దంటే.. అది రాజధాని ఎలా అవుతుందని  సీఎం జగన్  పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.  ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లను కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై రూ.4,287 కోట్ల అదనపు భారం పడుతుందని వ్యాఖ్యానించారు. కులం, మతం, ప్రాంతం, వర్గం ఏదీ చూడకుండా.. అర్హులైన అందరికీ ఇళ్లు కేటాయిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-25T21:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising