వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి?: ఆలపాటి రాజా

ABN, First Publish Date - 2020-09-20T23:00:02+05:30

వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి? అని మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొందని ధ్వజమెత్తారు.

వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి?: ఆలపాటి రాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి? అని  మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొందని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున ఆలయాలు, దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అవినీతి కేసుల్లో ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, కోర్టులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్నారని ఏది మాట్లాడినా చెల్లుతుందా అని  నిలదీశారు. విశాఖ భూములపై సీబీసీ విచారణ జరగాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. ఎన్డీబీ నిధులతో చేసే పనుల్లో కొందరికే టెండర్లు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. ఈఎస్‌ఐ కేసులో ఏ3 ప్రమోద్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? అని రాజా ప్రశ్నించారు.

Updated Date - 2020-09-20T23:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising