ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెస్టులు నిల్లు... పబ్లిసిటీ ఫుల్లన్నట్లుందే!: బుద్ధా

ABN, First Publish Date - 2020-03-28T09:10:01+05:30

కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విటర్‌లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘కరోనా అసలు పెద్ద విషయమే కాదు. ప్యానిక్‌ బటన్‌ నొక్కాల్సిన అవసరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విటర్‌లో  అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘కరోనా అసలు పెద్ద విషయమే కాదు. ప్యానిక్‌ బటన్‌ నొక్కాల్సిన అవసరం లేదు అన్నారు. పారాసిటమాల్‌తో తగ్గిపోతుంది, బ్లీచింగ్‌తో చచ్చిపోతుందని స్వయంగా ముఖ్యమంత్రే ఎన్నికలే పరామావధిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు జగన్‌ కరోనాని ఎదుర్కొన్న వీరుడు, ప్రపంచ దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి అని ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. వారిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. అసలు విదేశాల నుంచి వచ్చినవారు ఎంత మంది? 9 వేలు అని ఒకసారి, 11 వేలు అని, 14 వేలు అని ఆఖరికి 28 వేలు అని ఇప్పుడు అంటున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో ఎంతమందికి టెస్టులు చేశారు? ఇతర రాష్ట్రాల్లో రోజుకు చేస్తున్న టెస్టులు ఎన్ని? మన రాష్ట్రంలో చేస్తున్న టెస్టులు ఎన్ని? విజయసాయిరెడ్డి గారి ఆత్రం చూస్తుంటే.. చేస్తున్న టెస్టులు నిల్లు.. పబ్లిసిటీ ఫుల్లు అన్నట్లు ఉంది’’ అని బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-03-28T09:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising