ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-11-19T05:58:28+05:30

నెహ్రూ యువకేంద్ర (ఎన్‌వైకే) కు అనుబంధంగా ఉన్న యువజన సంఘాల నుంచి ఉత్తమ సంఘ అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని యూత్‌ కో ఆర్డినేటర్‌ (వైసీ) ఎస్‌.కీర్తన ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కాకినాడ,నవంబరు18 (ఆంధ్రజ్యోతి): నెహ్రూ యువకేంద్ర (ఎన్‌వైకే) కు అనుబంధంగా ఉన్న యువజన సంఘాల నుంచి ఉత్తమ సంఘ అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని యూత్‌ కో ఆర్డినేటర్‌ (వైసీ) ఎస్‌.కీర్తన ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను ఎన్‌వైకేతో కలిసి పనిచేస్తున్న సొసైటీ యాక్ట్‌ 1860 కింద రిజిస్టర్‌ అయిన యువజన సంఘాలు ఈ నెల 29 లోగా డోర్‌ నంబరు 9-8-63, కమలాదేవి వీధి, గాంధీనగర్‌, కాకినాడ చిరునామాకు దరఖాస్తులు పంపించాలని ఆమె స్పష్టం చేశారు. 2019-20 లో యువజన సంఘాలు నిర్వహించిన వృత్తి శిక్షణ శిబిరాలు, అవగాహన సదస్సులు, నాయకత్వ శిక్షణ శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాల డాక్యుమెంట్లు, ఫొటోలు, పత్రిక ప్రకటనల క్లిప్పింగులు రెండు సెట్లను దరఖాస్తుకు జత చేయాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ యువజన సంఘంగా ఎంపికైన సంఘానికి రూ. 25 వేల ప్రోత్సాహక నగదు బహుమతిగా ఇస్తామన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి ఎంపికకు ఎంట్రీ పంపుతామన్నారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయ ఫోన్‌ నంబరు 0884-2376063 లో సంప్రదించాలన్నారు.


Updated Date - 2020-11-19T05:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising