ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిమెంట్‌, ఇసుక బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టాలి

ABN, First Publish Date - 2020-12-11T06:32:48+05:30

రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌లు, గ్రామ సచివాలయాల పేరుతో వస్తున్న ప్రభుత్వ సిమెంట్‌, ఇసుక పెద్దఎత్తున బ్లాక్‌మార్కెటింగ్‌ జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ 


కోరుకొండ, డిసెంబరు 10 : రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌లు, గ్రామ సచివాలయాల పేరుతో వస్తున్న ప్రభుత్వ సిమెంట్‌, ఇసుక పెద్దఎత్తున బ్లాక్‌మార్కెటింగ్‌ జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ఆరోపించారు. గురువారం కోరుకొండలో టీడీపీ కార్యాలయంవద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి చెందిన ఇసుక, సిమెంట్‌ ప్రైవేట్‌ వ్యక్తులవద్ద కనిపించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఏ గ్రామంలో చూసినా ఈ అక్రమ బ్లాక్‌మార్కెటింగ్‌ కనిపిస్తుందన్నారు. దీన్ని వెంటనే అరికట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు ప్రభుత్వ కార్యాలయాలు లేక వైసీపీ కార్యాలయాలా చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ ఫ్లెక్సీలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణం వాటిని తొలగించాలన్నారు. ఈ సమావేశంలో మింగి లక్ష్మీనారాయణ, రొంగల శ్రీనివాస్‌, కొయ్య శామ్యూల్‌, మైరెడ్డి రాంబాబు, నాగా రమేష్‌, పరస శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising