ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్‌!

ABN, First Publish Date - 2020-03-15T09:14:22+05:30

కరోనా వైరస్‌ దెబ్బ అన్ని రంగాలపైనా పడుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాపింగ్‌మాల్స్‌, సినిమాథియేటర్లు బంద్‌ చేస్తారని ప్రచారం

రేపు ఓ నిర్ణయానికి రానున్న ట్రేడ్‌ వర్గాలు 


కాకినాడ అర్బన్‌, మార్చి 14:

కరోనా వైరస్‌ దెబ్బ అన్ని రంగాలపైనా పడుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేశారు. పక్కనున్న తెలంగాణలో శనివారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.  అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.  ముందు జాగ్రత్త చర్యగా అన్ని జిల్లాల్లో సినిమా థియేటర్లు, కొన్ని షాపింగ్‌ మాల్స్‌ మూసివేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఇది జరిగితే జిల్లాలో సుమారు 100 వరకూ థియేటర్లు, కొన్ని షాపింగ్‌మాల్స్‌పై ప్రభావం పడనుంది.   


ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సోమవారం సమావేశమై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో కూడా థియేటర్లు మూసివేసే పరిస్థితి వస్తుందని  ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జేకే రామకృష్ట తెలిపారు. ఇది జరిగితే వందలాది కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-03-15T09:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising