ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల త్యాగాన్ని మరవద్దు

ABN, First Publish Date - 2020-10-13T07:40:21+05:30

రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే అయితాబ త్తుల ఆనందరావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ అయితాబత్తుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమలాపురం టౌన్‌, అక్టోబరు 12:  రాజధాని  రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే అయితాబ త్తుల ఆనందరావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు, టీడీపీ సీనియర్‌ నాయకుడు మెట్ల రమణబాబు, నాయకులు సోమవారం సబ్‌కలెక్టర్‌ కార్యాల యం వద్ద నిరసన చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతి రైతులకు న్యాయం చేయాలని డిమాండు చేశారు.


రాష్ర్టానికి ఒక్కటే రాజధాని అమరావతి ఉండాలన్నారు. రైతుల త్యాగాలను అపహాస్యం, అవహేళన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాద న్నారు. అనంతరం వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పెచ్చెట్టి విజ యలక్ష్మి, మాజీ ఎంపీపీ యెరుబండి వెంకటేశ్వరరావు, నాయ కులు చిల్లా పురుషోత్తం, గెద్దాడ సత్యవేణి, వలవల శివరావు, అధికారి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. 


అమరావతినే కొనసాగించాలి

 రావులపాలెం రూరల్‌: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం   నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బండారు సత్యానందరావు ఆదేశాలతో  టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ జిలానీకి వినతిపత్రం అందజేశారు.

ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని, ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో గుత్తుల పట్టాభిరామారావు, కాసురెడ్డి, జక్కంపూడి వెంకటస్వామి, చిలువూరి సతీష్‌రాజు, సిద్దిరెడ్డి శ్రీను, మాసాబత్తుల ఆనందరావు, నెక్కంటి వెంకన్న, పెచ్చెట్టి చిన్నారావు, పమ్మి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T07:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising