ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చూడాలి

ABN, First Publish Date - 2020-12-11T06:22:38+05:30

గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య వైద్యాధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య 

రంపచోడవరం, డిసెంబరు 10: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో ఏడీఎంహెచ్‌వో, వైద్యాధికారులు, మలేరియా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో గర్భిణులను గుర్తించి నమోదు చేయాలని,  ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బం ది అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు రక్తహీనతపై అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి సమీపంలో స్పెష్పాలిటీ ఆసుపత్రుల జాబితాలను  పీహెచ్‌సీ గ్రామ సచివాలయాలు, సబ్‌సెంటర్లలో డిస్‌ప్లే చేయాలన్నారు. 3లక్షల 79 వేల దోమతెరలు సిద్ధంగా ఉన్నాయని, ప్రతి కుటుంబాని దోమతెరలను అందించేందుకు  జాబితాను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఎహెచ్‌వో సరిత, జిల్లా మలేరియా నియంత్రణాధికారి పీవీ సత్యనారాయణ, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్తిక్‌, ఎంపీహెచ్‌వోలు రాజు, గోవింద్‌బాబు, 104, 108 కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T06:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising