ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతులు ఎలా ఇచ్చారు

ABN, First Publish Date - 2020-05-09T07:59:23+05:30

విశాఖలో భీభత్సం సృష్టించిన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీపై కొన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 


అనపర్తి, మే 8: విశాఖలో భీభత్సం సృష్టించిన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీపై కొన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అనపర్తిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి ముందుగా కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఎందుకు నిర్వహించారని, కంపెనీ ప్రతినిధులపై బెయిల్‌బుల్‌ కేసులు నమోదు కావడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి కంపెనీ ఎంత ప్రమాదమో మరోసారి తేటతెల్లమైందని రంగంపేట మండలం దొంతమూరులో బిర్లా సంస్థ నిర్మించే పరిశ్రమ కూడా ఇటువంటి కోవలోకే వస్తుందని ఇప్పటికైనా ఇటు వంటి సంస్థలు జనావాసాల మధ్య నిర్మించకుండా చర్యలు చేపట్టాలని రామకృష్ణారెడ్డి  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-09T07:59:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising