ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ర్యాంపులకు 5 కి.మీ లోపు ఉచితంగా ఇసుక

ABN, First Publish Date - 2020-06-21T12:38:56+05:30

ర్యాంపులకు 5 కి.మీ లోపు ఉచితంగా ఇసుక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ర్యాంపులకు 5 కి.మీ లోపు గ్రామాల ప్రజల అవసరాలకు ఎద్దుల బండిపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఇసుక రవాణాపై మైనింగ్‌ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. నదీ పరివాహక ప్రాం తంలోని గుర్తించిన 118 గ్రామాలకు ఈ అవకాశం ఉందన్నారు. ఇసుక నిల్వ చేసినా, అమ్మినా జరిమానా విధిస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతీరోజూ మూడు వేల కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. కొవిడ్‌-19 ఆసుపత్రులు, వైద్య పరీక్షల నిర్వహణపై వైద్యాధికారులతో క్యాంపు కార్యాలయంలో  సమీక్షించారు. పాజిటివ్‌ కేసుల అడ్మిషన్‌, డిశ్చార్జ్‌ వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా పంపాలన్నారు. జేసీలు  శివశంకర్‌, మోహన్‌కుమార్‌, డీఆర్వో ప్రసాద్‌ పాల్గొన్నారు. గ్రామ సచివాలయల నిర్మాణాల్లో వేగం పెంచాలని పంచాయతీ రాజ్‌శాఖ ఇంజనీర్లను కలెక్టర్‌ ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలతో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయితీరాజ్‌ శాఖకు అప్పగించిన 811 గ్రామ పంచాయతీల నిర్మాణ పనులను ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 801 రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కూడా ఈ నెలాఖరుకు ప్రారంభించాలన్నారు. జేసీ మోహన్‌కుమార్‌, జడ్పీ సీఈ వో సూర్యప్రకాష్‌, సర్వశిక్షాభియాన్‌ ఏసీపీ రవీంద్రబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-21T12:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising