విశాఖ షిప్‌యార్డ్‌లో ఇలాంటి ప్రమాదం దురదృష్టం: గంటా
ABN, First Publish Date - 2020-08-01T21:45:39+05:30
హిందుస్థాన్ షిప్‌యార్డులో 10 మంది మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, షిప్ యార్డ్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమని
విశాఖ: హిందుస్థాన్ షిప్‌యార్డులో 10 మంది మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, షిప్ యార్డ్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయించాలని కోరారు. ఘటనపై విచారణ జరపాలని, వైఫల్యాలను సరిదిద్దాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
Updated Date - 2020-08-01T21:45:39+05:30 IST