ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం స్పందించదు.. కాలేజీలు చేర్చుకోవు!

ABN, First Publish Date - 2020-06-04T09:25:57+05:30

ప్రభుత్వం, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు సీట్లు భర్తీ చేసేశారు. గురువారం సాయంత్రం 3 గంటల్లోపు కాలేజీల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • త్రిశంకు స్వర్గంలో మెడికల్‌ విద్యార్థులు


అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు సీట్లు భర్తీ చేసేశారు. గురువారం సాయంత్రం 3 గంటల్లోపు కాలేజీల్లో రిపోర్టు చేయకపోతే సీటు రద్దవుతుందని వర్సిటీ నిబంధన పెట్టింది. సీటు కేటాయింపు పత్రాలను తీసుకుని కాలేజీలకు వెళ్తే యాజమాన్యాలు అడ్మిషన్లు ఆపేశామని చెబుతున్నాయి దీంతో వందలాది విద్యార్థులు బుధవారం వర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ పరిస్థితుల్లో వర్సిటీ అధికారులు జాయినింగ్‌ తేదీని జూన్‌ 10 వరకూ పొడిగించారు. ఈలోగా ప్రభుత్వం ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతో చర్చలు జరిపి ఏదో ఒకటి తేల్చాలి. లేదంటే విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కాలేజీలతో చర్చలు జరిపితే మంచిదని వర్సిటీ అధికారులు అంటున్నారు.

Updated Date - 2020-06-04T09:25:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising