ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీపీఎస్సీ నోటిపికేషన్లు విడుదలచేయాలి: కేఎస్‌

ABN, First Publish Date - 2020-06-25T09:53:31+05:30

ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ ప్రకారం ఇయర్‌ విధానం అమలు చేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కేఏస్‌ లక్ష్మణరావు, నిరుద్యోగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ ప్రకారం ఇయర్‌ విధానం అమలు చేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కేఏస్‌ లక్ష్మణరావు, నిరుద్యోగ ఐక్యవేదిక సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో లక్షలాదిగా ఉన్న ఖాళీపోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఒకే పరీక్షా విధానాన్ని అమలుచేయాలన్నారు.


ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి 46ఏళ్లకు పెంచాలని కోరారు. గత నవంబర్‌లో నిర్వహించిన ఏపీపీఎస్సీ సమీక్షసమావేశం తుది నివేదికను బహిర్గతం చేయాలని.. అనువాదదోషాలు లేకుండా ప్రతి అభ్యర్థికి సమన్యాయం జరిగే విధంగా ప్రశ్నపత్రం రూపకల్పన జరగాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ ఐక్యవేదిక కో కన్వీనర్‌ బి. అరుణ్‌కుమార్‌, సభ్యులు జి.శ్రీనివాసరెడ్డి, కె.వంశీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T09:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising