ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ఆశల సౌధం

ABN, First Publish Date - 2020-12-27T05:20:13+05:30

రాజధాని అమరావతి కావాలని కోరుతూ 33వేల ఎకరాల్లో ఐదుకోట్లమంది ఆశల సౌధం నిర్మించుకుంటే దానిని వైసీపీ ప్రభుత్వం కూలదోసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంకటపాలెం దీక్షా శిబిరంలో రైతుల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వమే దానిని నిలువునా కూల్చేస్తోంది.. 

భూములు త్యాగం చేసిన రైతులను నడిరోడ్డుపై నిలబెట్టారు

375వ రోజుకు చేరిన ఆందోళనలు 


తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, డిసెంబరు 26: రాజధాని అమరావతి కావాలని కోరుతూ  33వేల ఎకరాల్లో ఐదుకోట్లమంది ఆశల సౌధం నిర్మించుకుంటే దానిని వైసీపీ ప్రభుత్వం కూలదోసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 375వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానిలో అన్ని కులాలు, మతాలవారు ఉన్నారన్నారు. సీఎం జగన్‌ తెలుసుకోకుండా పిచ్చివా నిగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. శాశ్వత రాజధానిగా అమరావతిని సీఎం జగన్‌ ఎందుకు కాదంటున్నారో ప్రతి ఒక్కరూ ఆలో చించాలన్నారు. స్వార్ధ ప్ర యోజనాల కోసం మూడు ముక్కల ఆటతో రాష్ట్ర భవిష్య త్తుని నాశనం చేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇటువంటి పాలకులు ఉన్నంత కాలం అభివృద్ధి ఉండదన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ అమరావతి ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్మోహనరెడ్డి చేసిన మూడు రాజ ధానుల ప్రక టనతో రాజధాని నిర్మాణానికి భూము లిచ్చిన రైతు లతో పాటు రాష్ట్రానికి తీరని అన్యాయం జరు గుతోందన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామ రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటుంన్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకునేవరకు తమ పోరాటాన్ని కొనసా గిస్తామన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతుల నిరసన దీక్షలు కొనసాగాయి. జగమొండి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. ఈ దీక్షల్లో ఐకాస నేతలు, స్థానిక రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.


Updated Date - 2020-12-27T05:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising