ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చెత్త’ పనిపై విచారణ

ABN, First Publish Date - 2020-12-27T08:07:55+05:30

బ్యాంకుల ముందు చెత్తను డంపింగ్‌ చేసిన ఘటనపై పురపాలక శాఖ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరులో అధికారులను విచారించిన బృందం 


విజయవాడ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల ముందు చెత్తను డంపింగ్‌ చేసిన ఘటనపై పురపాలక శాఖ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌(గుంటూరు) జి.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు జి.శేఖర్‌, జి.వెంకటేశ్వర్లును విచారణాధికారులుగా నియమించింది. శనివారం ఈ విచారణ బృందం కృష్ణాజిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులను విచారించింది. ఈ ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుంది. బ్యాంకుల్లోనూ విచారణ చేయాల్సి ఉన్నప్పటికీ శనివారం సెలవు కారణంగా సాధ్యం కాలేదు.


కాగా ఉయ్యూరులో నాలుగు బ్యాంకుల ముందు చెత్తను డంప్‌ చేసిన ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని కమిషనర్‌ సూర్యప్రకాశరావు తెలిపారు. తనకు సమాచారం రాగానే వెంటనే దాన్ని తొలగించడంతో పాటు బ్లీచింగ్‌ చల్లించి, శానిటైజ్‌ చేశామని వివరించారు. బ్యాంకర్ల మనోభావాలు దెబ్బతీయాలని గానీ, వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-12-27T08:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising