ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలన ఆనాటి ఎమర్జెన్సీని తలపిస్తోంది: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-06-25T22:04:39+05:30

రాష్ట్రంలో జగన్ పాలన 45 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ రోజుల్ని తలపిస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఆనాడు ఇందిరా పాలనపై ప్రజలు ఓటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో జగన్ పాలన 45 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ రోజుల్ని తలపిస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఆనాడు ఇందిరా పాలనపై ప్రజలు ఓటు ద్వారా తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని, దాని ఫలితమే ఇందిరా ప్రభుత్వం పడిపోయి జన సంఘ్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. రాజ్యాంగ విలువల్ని కాలరాసి నియంతలా వ్యవహరించాలనుకుంటే ప్రజలు చూస్తూ ఉరుకోరని అన్నారు. జగన్ ప్రభుత్వం సైతం అలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. అయితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రజాస్వామ్య శైలిలో బుద్ధి చెప్తారని వర్ల రామయ్య అన్నారు.


‘‘ప్రజావేదికను స్క్రాప్‌గా మార్చి రూ.11 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. చంద్రబాబు తిరిగిన చోట తాను తిరగకూడదనే ఉద్దేశంతోనే దుర్మార్గంగా ప్రజావేదికను కూల్చివేశారు. ప్రజావేదిక ఉండి ఉంటే క్వారంటైన్ సెంటర్‌గా అయినా ప్రజలకు ఉపయోగపడి ఉండేది. ప్రజావేదిక శిథిలాలను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేశారు. 69 సార్లు కోర్టులు చీవాట్లు పెట్టినా.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. 45 ఏళ్లు క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీకి.. జగన్ ప్రభుత్వం విధించిన అప్రకటిత ఎమర్జెన్సీకి పెద్ద తేడా లేదు. టీడీపీ మహిళ నేతలపై అసభ్యకరంగా పోస్టింగులు పెట్టిన వారిని ఒక్కరినైనా అరెస్ట్ చేశారా..? రూ.3 కోట్ల అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నను ఈ రకంగా వేధిస్తే.. రూ.43 వేల కోట్లు కొట్టేసిన వారిని ఏం చేయాలి..? ఎర్రన్నాయుడు కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత కక్ష..? మీపై పిటిషన్ వేశారనా..? 16 జైలు జీవితం గడపడానికి కారణమనా..? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరగడానికి ఆయన వేసిన కేసులే కారణమనా..?’’ అని వర్ల రామయ్య అన్నారు.



Updated Date - 2020-06-25T22:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising