ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రాక్షస పాలన

ABN, First Publish Date - 2020-12-27T04:48:50+05:30

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు 

రైల్వేకోడూరు రూరల్‌, డిసెంబరు 26: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలపై శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కాంగ్రెస్‌, సీపీఐ నాయకులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతుల కన్నీళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటం లేదాఅని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో రైతులు కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు విరుద్ధంగా దీక్షలు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తన కేసులకు భయపడి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడం సిగ్గుచేటని ఆరోపించారు. తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ ఏరియా కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని వాటిని రాష్ట్రంలో అమలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త విశ్వేశ్వర నాయుడు,రైల్వేకోడూరు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ గోశాల దేవి, టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు పెరుగు క్రిష్ణయ్య, ఓబులవారిపల్లి మాజీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, రైల్వేకోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు కొమ్మశివ, సీపీఐ మండల పార్టీ కార్యదర్శి జయచంద్ర, కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T04:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising