ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ బిల్లులకు కరోనా గ్రహణం

ABN, First Publish Date - 2020-04-18T08:48:48+05:30

కరోనా ప్రభావం విద్యుత్‌శాఖపై పడింది. వినియోగం, సరఫరాపై కాదు. బిల్లుల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావాల్సింది రూ.44 కోట్లు.. వచ్చింది రూ.12 కోట్లు


కడప (సిటి), ఏప్రిల్‌ 17 : కరోనా ప్రభావం విద్యుత్‌శాఖపై పడింది. వినియోగం, సరఫరాపై కాదు. బిల్లుల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. రీడింగ్‌ తీయకపోవడంతో ఫిబ్రవరి వినియోగం మొత్తాన్నే మార్చి నెలకు బిల్లు చెల్లించాల్సి వచ్చినా... చెల్లించేందుకు వినియోగదారుడికి అవ కాశం లేక వసూలు 28 శాతానికే పరిమితమైంది.


జిల్లాలో రూ.44.56 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.12.08 కోట్లు మాత్రమే చెల్లింపులయ్యాయి. అపరాధ రుసుం లేకుండా గడువు శనివారంతో ముగియనుంది. ఇంకా 72 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ చె ల్లింపులు అనుమానమనే చెప్పవచ్చు.


యాప్‌లపై అవగాహన లేకపోవడంతో తగ్గిన వసూలు

బిల్లుల చెల్లింపు కోసం విద్యుత్‌శాఖ వివిధ యాప్‌లను ప్రవేశపెట్టింది. వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకుని చెల్లించాలని అధికారులు సూచిస్తూ వస్తున్నారు. అయితే వినియోగదారుల్లో 90 శాతం మందికి ఈ యాప్‌లపై అవగాహన లేదనే చెప్పవచ్చు. ఇక వసూలు కేంద్రాలపైనే ఆధారపడ్డారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. ఉన్న కేంద్రాల వద్ద క్యూలు పెరిగిపోతున్నాయి. భౌతికదూరం పాటించాల్సి రావడం, అప్పుడప్పుడూ సర్వర్లు మొరాయించడంతో చెల్లింపు ఆలస్యమవుతూ వస్తోంది. ఎలాగో వచ్చినా సమయం తక్కువగా ఉండడంతో అనేకమంది వెనక్కు వెళ్లిపోతున్నారు. ఫిబ్రవరి వినియోగం బిల్లు మొత్తాన్నే చెల్లిస్తున్నా మిగతా మొత్తం తదుపరి నెలలో వచ్చే బిల్లుతో కలిపి మోపెడంత కట్టాల్సి వస్తుందని ఇప్పటి నుంచే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మే 3వతేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో ఈ నెల రీడింగ్‌ కూడా వచ్చే అవకాశాలు లేవు. అంటే ఫిబ్రవరి వినియోగం మొత్తం ఏప్రిల్‌ వినియోగం కింద చెల్లించాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


వివిధ కేటగిరిల కింద చెల్లింపు వివరాలు.

విభాగం చెల్లించాల్సింది చెల్లించింది బ్యాలెన్స్‌

గృహావసరాలు రూ.18.18,20,000 రూ.6,88,17,000 రూ.11,30,03,000

వ్యాపార,వాణిజ్యం రూ.12,64,36,000 రూ.2,55,92,000 రూ.10,08,44,000

పరిశ్రమలు రూ.4,60,77,000 రూ.1,14,22,000 రూ.3,46,55,000

వీధిదీపాలు,నీటిపథకాలు రూ.8,88,06,000 రూ.1,45,70,000 రూ.7,42,37,000

వ్యవసాయం రూ. 25,00,000 రూ. 4,12,000 రూ.  20,88,000

మొత్తం రూ.44,56,39,000 రూ.12,08,13,000 రూ.32,28,27,000


Updated Date - 2020-04-18T08:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising