ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి కోసం 88వ రోజూ కొనసాగిన ఆందోళనలు

ABN, First Publish Date - 2020-03-15T10:23:09+05:30

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళగిరి మండలం ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు శనివారం 88వ రోజుకు చేరాయి.  జేఏసీ నాయకులు ఎస్‌డీ షరీఫ్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు.  గుంటూరుకు చెందిన రమేష్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ శైలజ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి ఎర్రబాలెం రైతు దీక్షలకు సంఘీభావం తెలిపి రూ.20వేలను విరాళంగా అందజేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాకలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తాడికొండ అడ్డరోడ్డులో నిరసనలు శనివారం నాటికి 71వ రోజుకు చేరుకున్నాయి. 

అమరావతి కోసం నేనుసైతం

అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఓ బాలుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రాయపూడి దీక్షా శిబిరానికి 88 రోజులుగా హాజరవుతున్నాడు అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు అంకరాజు. ఉదయం 9 గంటలకు అందరి కంటే ముందు హాజరై టెంట్లలో కుర్చీలు, మైకులను సిద్ధం చేస్తున్నాడు. ‘అమరావతిని కొనసాగేలా చూడమ్మా..’ అంటూ శిబిరం పక్కనే ఉన్న పోలేరమ్మకు 88 రోజులుగా తనే స్వయంగా అన్నప్రసాదం పెడుతున్నాడు. ఈ దివ్యాంగుడికి అధికారులు పింఛనును నిరాకరించారని గ్రామస్తులు చెబుతున్నారు. న్యాయ పోరాట నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాగిపాడు గ్రామస్తులు శనివారం రాజధాని రైతు  జేఏసీ సభ్యులకు రూ.40వేలు అందజేశారు.

Updated Date - 2020-03-15T10:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising