ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.10లక్షల విలువైన గుట్కా, గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2020-12-26T06:08:41+05:30

నిషేదిత గుట్కాప్యాకెట్ల రవాణాను పామర్రు పోలీసులు నిరోధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామర్రు, డిసెంబరు 25 : నిషేదిత గుట్కాప్యాకెట్ల రవాణాను పామర్రు పోలీసులు నిరోధించారు. గుడివాడ డీఏస్పీ ఎన్‌.సత్యానందం విలేఖర్లకు తెలి పిన వివరాల ప్రకారం ఉయ్యూరుకు చెందిన వ్యక్తి కోప్పురి కాంతారావు కోల్‌కత్తా నుంచి ఐరన్‌లోడుతో హైదరాబాద్‌కు వస్తున్న తెలంగాణకు చెందిన లారీలో రూ.10లక్షల విలువైన గుట్కాపాక్కెట్లతోపాటు రూ.6వేల విలువైన 2 కేజీల గంజాయిని దిగుమతి చేసుకునేందుకు కిరాయి మాట్లాడుకున్నాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఎస్సై జి.శ్రీహరిబాబు శుక్ర వారం పామర్రు పరిధిలో గుడివాడ రోడ్డులోని అరవింద పాఠశాల వద్ద అడ్డుకుని పరిశీలించగా దానిలో నిషేదిత గుట్కా సరుకుతోపాటు 2 కేజీల గంజాయిని గుర్తించారు. వాటిని రవాణా చేస్తున్న లారీడ్రైవర్‌ తిరుమారెడ్డి శ్రీనివాసరావును, గుట్కా వ్యాపారి కాంతారావును అదుపులోకి తీసుకున్నామన్నారు. వారితోపాటు మూడు సెల్‌పోన్లు, మోపెడ్‌ను స్వాదీనం చేసుకున్నారు. లోడ్‌ చేయించిన ఒరిస్సాలోని బరంపురానికి చెందిన గణేష్‌తో పాటు లారీ యాజమాని కసవరాజు ప్రసాద్‌ను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కాంతారావుపై ఇప్పటికే ఉయ్యూరు, సమీపస్టేషన్లలో పలుకేసులు నమోదైనట్లు చెప్పారు. ఎస్సై జి.శ్రీహరిబాబు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో సీఐ ఎం.కిషోర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T06:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising