ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన మేత ధర.. నష్టాల్లో ఆక్వా రైతులు

ABN, First Publish Date - 2020-02-24T09:19:24+05:30

మార్కెట్‌లో పది టన్నులు తవుడు (డీవోబీ) రూ.1.60 లక్షలుపైగా పలుకుతోంది. రొయ్యల సాగు ఆశాజనకంగా లేకనష్టాలు పెరిగిపోవటంతో చేపల సాగువైపు రైతులు మొగ్గు చూపడటంతో డిమాండ్‌ ఏర్పడిందని రైతులంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలిదిండి : మార్కెట్‌లో పది టన్నులు తవుడు (డీవోబీ) రూ.1.60 లక్షలుపైగా పలుకుతోంది. రొయ్యల సాగు ఆశాజనకంగా లేకనష్టాలు పెరిగిపోవటంతో చేపల సాగువైపు రైతులు మొగ్గు చూపడటంతో  డిమాండ్‌ ఏర్పడిందని రైతులంటున్నారు. ఎనిమిది నెలల వ్యవధిలో చేప మూడున్నర కిలోల ఆహారం తీసుకుని కిలో బరువు పెరుగుతుంది. చెరువులో ఉన్న చేపల సైజు బటికట మేత పరిమాణం ఆధారపడి ఉంటుంది.  తవుడుతోపాటు వేరుశనగ చెక్క, పత్తి పిండి ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. చేపల మేత ధరతోపాటు చెరువుల లీజులు కూడ పెరిగాయి. ఎకరానికి రూ.80 వేలకుపైగా లీజు చెల్లిస్తున్నారు. గతంలో రూ.40 వేలు నుంచి రూ.60 వేలు మధ్యలో ఉండేది. దీంతో రైతులు బెంబేలె త్తుతున్నారు.


చేపకు అదనంగా రూ.30  ఖర్చు

చేప కిలో పెరగాలంటే ప్రస్తుతం రూ.30 అదనంగా ఖర్చు అవుతుందని రైతులంటున్నారు. డీవోబీ,  పత్తిపిండి, వేరుశెనగ చెక్కలు ధరలు పెరగటంతో  ఖర్చు పెరిగిందని రైతులు వాపోతున్నారు. అయితే మార్కెట్‌లో చేపల ధర మాత్రం పెరగటం లేదని ఆదేవన వ్యక్తంచేస్తున్నారు. దీనికి తోడు వాతావరణ పరిస్థితుల వల్ల పలు రకాల వ్యాధులతో చేపలు చచ్చిపోతూ తీవ్రంగా నష్టాన్ని మిగిల్చుతున్నాయంటున్నారు.  మార్కెట్‌లో కిలోపైన ఉన్న చేపలు రూ.110 గరిష్టంగా ఉండగా, రూ.90 కనిష్టంగాఉంది. అదనపు ఖర్చు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. 

Updated Date - 2020-02-24T09:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising