ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సస్యరక్షణతో మామిడి పూతను రక్షించుకోవచ్చు

ABN, First Publish Date - 2020-11-26T06:16:38+05:30

నివర్‌ తుపాను ప్రభావం వల్ల మామిడి పూతను కోల్పోయే ప్రమాదం ఉన్నందున రైతులు పూతను సంరక్షించుకునేందుకు కొద్దిపాటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని నూజివీడు ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు సి.హెచ్‌.శ్రీనివాసులు అన్నారు.

మామిడి తోటను పరిశీలిస్తున్న ఉద్యాన శాఖాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసులు 

నూజివీడు టౌన్‌ /రూరల్‌, నవంబరు 25 : నివర్‌ తుపాను ప్రభావం వల్ల  మామిడి పూతను కోల్పోయే ప్రమాదం ఉన్నందున రైతులు పూతను సంరక్షించుకునేందుకు కొద్దిపాటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని నూజివీడు ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు సి.హెచ్‌.శ్రీనివాసులు అన్నారు. దిగవల్లి, హనుమంతులగూడెం, మిట్టగూడెం గ్రామాల్లోని బుధవారం మామిడి తోటలను పరిశీలించారు. మామిడి రైతులు ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని తోటలో ఎండు పుల్లలు తీసివేయడం, లోతుగా దుక్కులు దున్ని, సకాలంలో ఎరువులను వాడటం వల్ల పూతను సంరక్షించుకోవచ్చన్నారు. వాతావరణం తేమగా, మబ్బులు పట్టి ఉండటం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. దీంతో పాటుగా వాతావరణ ప్రభావంతో మామిడికి కాయపుచ్చు, బూడిద తెగులు, మసిమంగు తదితర తెగుళ్లను నివారించడానికి ఉద్యాన అధికారులను సంప్రదించి, సకాలంలో ఎరువులు, రసాయనిక మందులను తగిన మోతాదులో పిచికారీ చేయాలన్నారు.  రైతులు సలహాలు, సూచనలకు 7995086773, 7382633662 నెంబర్లను సంప్రదించాలని శ్రీనివాసులు కోరారు. కార్యక్రమంలో రైతులు, మండల ఉద్యాన శాఖ అధికారిణి రత్నమాల తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-11-26T06:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising