ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం హెలికాఫ్టర్‌లో.. మంత్రులు ప్రెస్‌మీట్‌లో..!

ABN, First Publish Date - 2020-12-27T15:07:39+05:30

తుఫానులకు రైతులు పెద్ద ఎత్తున పంటలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శ


మచిలీపట్నం టౌన్: తుఫానులకు రైతులు పెద్ద ఎత్తున పంటలను నష్టపోతే సీఎం హెలికాఫ్టర్‌లో తిరుగుతుంటే మంత్రులు పత్రికా సమావేశాలకు పరిమితమవుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. మచిలీపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివర్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పవన్‌కళ్యాణ్‌ పర్యటిస్తున్నప్పుడు వేలాది మంది రైతులు తమ కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు. మాజీ ఎంపీ రెడ్డయ్య కూడా ఇంత నష్టం ఏనాడూ వాటిల్లలేదని పవన్‌ కళ్యాణ్‌కు చెప్పారన్నారు. కృష్ణాజిల్లాలో దాదాపు 2 లక్షల 40వేల ఎకరాల్లో పంటనష్టం సంభవించిందన్నారు. కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. నష్టపరిహారం రూ.35వేలు ఇవ్వాలని, తక్షణమే రూ.10వేలు అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాల 32వేల ఎకరాలకు నష్టం జరిగిందని శాసనసభలో వ్యవసాయ మంత్రి నివేదిక సమర్పిస్తే కేబినెట్‌లో 13 లక్షల ఎకరాల్లో మాత్రమే నష్టం సంభవించిందని ఆమోదించి 4లక్షల ఎకరాలను తొలగించేశారన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండ్రెడ్డి రామకృష్ణ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, జనసేన నేతలు పోతిన వెంకట మహేష్‌, అక్కల గాంధీ, కళ్యాణం శివశ్రీనివాస్‌, అమ్మిరెడ్డి వాసు, బూరగడ్డ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


28న జనసేనాని పవన్‌కళ్యాణ్‌ జిల్లా పర్యటన 

గుడివాడ : రైతులను ఆదుకోవాల్సిన నైతికబాధ్యతను ప్రభుత్వం విస్మరించినందుకు నిరసనగా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఈనెల 28న మచిలీపట్నంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. స్థానిక నెహ్రూ చౌక్‌లోని జనసేన కార్యాలయంంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్‌ ఈనెల 28న ఉదయం గుడివాడ లో పర్యటిస్తారన్నారు. అనంతరం పెడన మీదుగా మచిలీపట్నం చేరుకుంటారన్నారు. జనసేన రాష్ట్ర అధికారప్రతినిధి పోతిన మహేష్‌, మచిలీపట్నం ఇన్‌చార్జి లంకిశెట్టి బాలాజీ, గుడివాడ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-27T15:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising