ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN, First Publish Date - 2020-06-22T10:12:35+05:30

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకులు ఘనంగా జరుపుకున్నారు. యోగ అట్‌ హోమ్‌, యోగా విత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసనాలు చేయించిన  గురువులు 


ఆదోని(అగ్రికల్చర్‌), జూన్‌ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకులు ఘనంగా జరుపుకున్నారు. యోగ అట్‌ హోమ్‌, యోగా విత్‌ ఫ్యామిలీ సందర్భంగా ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.అయ్యప్ప ఆధ్వర్యంలో జరుపకున్నారు. అధ్యాపకులు వారి ఇళ్లల్లో కుటుంబాలతో కలిసి యోగాసనాలు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు డా.రమేష్‌, డా.వేణుగోపాల్‌, డా.నీరజాక్షి, ప్రకా్‌షరావు, రామకృష్ణ, జోనాథన్‌, ఇందిరా, ఉమా, హరిత, జ్యోతి పాల్గొన్నారు. 


హొళగుంద: స్థానిక సిద్ధేశ్వరస్వామి దేవాలయ ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు హనుమాన్‌ మిత్రమండలి సభ్యులు ఈఎన్‌ ప్రసాద్‌, చిదానంద, మల్లేష్‌, మల్లికార్జున తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.ఆవుల చంద్రశేఖర్‌ హాజరై మాట్లాడారు. నిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడిని జయించవచ్చన్నారు. కార్యక్రమంలో వెంకటగిరి, గాదిలింగ, శీను పాల్గొన్నారు.


కోవెలకుంట్ల: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని యోగా గురువు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో కుందూ పరివాహక గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు నాగేశ్వరరావుతో యోగాసనాలు చేయించారు. సూర్య నమస్కారాలు, భుజంగ ఆసనం, సర్వాంగ ఆసనం మొదలైన ఆసనాలతో పాటు ప్రాణాయామాలు తపాలాబాతి, అనులోమ, విలోమా చేయించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ అఽధ్యక్షుడు అప్పపోగుల వెంకటసుబ్బయ్య, స్టేట్‌ బ్యాంకు మేనేజరు ఎస్‌కేవీ గుప్త, ఆర్యవైశ్య మెంబర్‌ ధరణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-22T10:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising