ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుగురికి పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-05-10T09:39:57+05:30

జిల్లాలో శనివారం మరో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 553కు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరు మృతి

21 మంది డిశ్చార్జి


కర్నూలు(హాస్పిటల్‌), మే 9: జిల్లాలో శనివారం మరో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 553కు చేరింది. ఇందులో మరణాలు, డిశ్చార్జిలు పోనూ 299 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా పాజిటివ్‌ కేసుల్లో కర్నూలు నగరంలో 3, నంద్యాలలో 1, ఆదోనిలో 2 ఉన్నాయి. కొవిడ్‌ బాధితుల సంఖ్య కర్నూలు నగరంలో 345, నంద్యాలలో 111, ఆదోనిలో నలుగురికి చేరింది. కర్నూలు నగరంలో మరో కొవిడ్‌ బాధితుడు  మృతి చెందారు. జిల్లాలో మృతుల సంఖ్య 15కు చేరింది. వైరస్‌ నుంచి కోలుకున్న 21 మందిని వైద్యులు శనివారం డిశ్చార్జి చేశారు.


కర్నూలు స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి ఐదుగురు, విశ్వభారతి జిల్లా కొవిడ్‌ ఆసుపత్రి నుంచి 12 మంది, నంద్యాల శాంతిరాం జిల్లా కొవిడ్‌ ఆసుపత్రి నుంచి నలుగురు శనివారం డిశ్చార్జి అయ్యారు.  దీతో జిల్లాలో కోలుకున్న వారి సంఖ్య 239కు చేరింది. కర్నూలు జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జి అయిన ఐదుగురికి సూపరింటెండెంట్‌ డిశ్చార్జి సమ్మరీని అందజేశారు. వీరిలో ముగ్గురు 70 ఏళ్లు, ఒకరు 63 ఏళ్లు, మరొకరు 45 ఏళ్లు దాటిన వారు కావడం విశేషం. కార్యక్రమంలో ఏఆర్‌ఎంవో డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవికళాధర్‌ రెడ్డి, డాక్టర్‌ రామ్‌ శివనాయక్‌, డాక్టర్‌ శాంతిరాజ్‌ పాల్గొన్నారు. 


కాల్‌ సెంటర్‌ ప్రారంభం

కరోనా రోగుల సహాయార్థం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించారు. 18004255422 నెంబర్‌కు కాల్‌ చేసి ఆసుపత్రిలో కరోనా సమాచారం తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్దాసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ హేమనళిని, ఆరోగ్యశ్రీ చీఫ్‌ ర్యాంకో డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T09:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising