ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పాజిటివ్‌ వస్తే కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స: ఆర్డీవో

ABN, First Publish Date - 2020-08-18T10:38:24+05:30

కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే ఖచ్చితంగా కొవిడ్‌ ఆసుపత్రిలోనే చికిత్సలు పొందాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో కొవిడ్‌-19పై డివిజన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, ఆగస్టు 17: కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే ఖచ్చితంగా కొవిడ్‌ ఆసుపత్రిలోనే చికిత్సలు పొందాలని ఆర్డీవో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో కొవిడ్‌-19పై డివిజన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నేటి నుంచి కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైన వ్యక్తులు హోం ఐసొలేషన్‌లో ఉండటానికి వీలులేదన్నారు. వారిని వెంటనే టిడ్కో కొవిడ్‌ సెంటర్‌లో చికిత్సల కోసం ఉంచాలన్నారు.


కొవిడ్‌ సెంటర్‌లో బాధితులకు పౌష్టికాహారాన్ని అందించే విధంగా చూస్తామన్నారు. కొవిడ్‌ ఆసుపత్రికి వివిధ శాఖల అధికారుల ఫోన్‌ నెంబర్లను ఉంచుతామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ రామకృష్ణ, డీఎస్పీ వినోద్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సుబ్బారావు, సీఐ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-18T10:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising