ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయం కీలక ప్రకటన

ABN, First Publish Date - 2020-07-22T22:45:57+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలలో భాగంగా నిర్వహించే మహరథోత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూల్:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలలో భాగంగా నిర్వహించే మహరథోత్సవం ఈ ఏడాది లేదని మఠం అధికారులు తెలిపారు. ఆగస్టు 2 నుంచి 8 వరకు జరగాల్సిన సప్తరాత్రోత్సవాల్లో కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనే వారి సంఖ్యను 50 మందికి లోపుగానే పరిమితం చేసి శ్రీమఠం ప్రాంగణంలో శ్రీమఠం సంప్రదాయాలను అనుసరించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, శిష్యులు, భజన మండళ్లు ఈ ఆరాధన ఉత్సవాలను శ్రీ మఠం యూట్యూబ్ ఛానల్ ‘మంత్రాలయ వాహిని’లో చూడవలసిందిగా కోరారు. కరోనా ఉధృతి తగ్గిన వెంటనే ఈ ఆరాధనకు సంబంధించి ఆరాధన సంస్మరణోత్సవం పేరిట వైభవ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు, దీనిని భక్తులు గమనించాలన్నారు. ఈ ఆరాధన ఉత్సవాల్లో కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. కావున దర్శనార్థం వచ్చే భక్తులు, శిష్యులు రావద్దని తెలిపారు. మంత్రాలయంలో ఎటువంటి వసతి, దర్శన భాగ్యం లేవని, భక్తులు గమనించి ఎవరి ఇంటి వద్దే వారే ఉండి రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పోందాలని సూచించారు. 

Updated Date - 2020-07-22T22:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising