ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతి సమాచారం ఆలస్యం

ABN, First Publish Date - 2020-09-06T08:00:00+05:30

కరోనాతో మృతి చెందిన వ్యక్తి(70) సమాచారాన్ని నాలుగు రోజుల తర్వాత తెలపడంపై మృతుడి కుటుంబ సభ్యులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబసభ్యుల ఆగ్రహం

అంత్యక్రియలకు రూ.15 వేల వసూలు

ఆసుపత్రి తీరుపై విచారణ జరపాలి: లోక్‌సత్తా


నెల్లూరు (వైద్యం)సెప్టెంబరు 5 : కరోనాతో మృతి చెందిన వ్యక్తి(70) సమాచారాన్ని నాలుగు రోజుల తర్వాత తెలపడంపై మృతుడి కుటుంబ సభ్యులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు కావలికి చెందిన రెడ్‌క్రాస్‌ జీవిత కాలపు సభ్యుడు ఏన్డీసీసీ రిటైర్డ్‌ ఏజీఎం సూరయ్యకు కరోనా రావడంతో గత నెల 26న జిల్లా కొవిడ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి కుమార్తె పద్మావతి, మనవడు నశికేత్‌ గత నెల 30న ఆసుపత్రికి వచ్చి విచారించగా సూరయ్య ఆరోగ్యం భాగానే ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం కోసం ఆమె తన ఫోన్‌ నెంబర్‌ వారికిచ్చింది. బాధితుడు 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు మృతి చెందారు. ఆ సమాచారం కుటుంబ సభ్యులకు తెలపకుండా అధికారులు మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. ఈనెల 4వ తేదీన కుటుంబ సభ్యులకు మరణవార్త గురించి తెలపడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తీరా మృతదేహం అంత్యక్రియల కోసం రూ.15వేలు ఇవ్వాలని అక్కడి వారు డిమాండ్‌ చేయడంతో శనివారం ఆ మొత్తం చెల్లించారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు అంకయ్య చౌదరి మాట్లాడుతూ జిల్లా కొవిడ్‌ ఆసుపత్రి చర్యలపై విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

Updated Date - 2020-09-06T08:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising