ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకపక్షంగా విద్యావిధానాల మార్పు సరికాదు

ABN, First Publish Date - 2020-08-01T10:41:27+05:30

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించకుం డా విద్యావిధానాలను మార్పు చేయడం సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ మంత్రి సోమిరెడ్డి


నెల్లూరు(వ్యవసాయం), జూలై 31 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించకుం డా విద్యావిధానాలను మార్పు చేయడం సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నూతన కార్యవర్గం శుక్రవారం సోమిరెడ్డితోపాటు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు.


డిగ్రీ విద్యను మూడేళ్లు కొనసాగిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా విద్యార్థి విభాగం జిల్లాలోని విద్యార్థులను చైతన్యపరచి వారి సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు డీవీ కృష్ణయాదవ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ప్రణయ్‌ కుమార్‌, ఎం సుమన్‌, ప్రభాకర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, సాయి, రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T10:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising