ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వోద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం

ABN, First Publish Date - 2020-03-23T10:00:48+05:30

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ శాఖల్లోని నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లా స్థాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సగం మందే కార్యాలయానికి..

మిగిలిన వారి ఇంటి నుంచే విధులు

వచ్చే నెల 4 వరకు అమలు

కార్యాలయాలకు సందర్శకుల రాకపై నిషేధం


నెల్లూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ శాఖల్లోని నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లా స్థాయి కార్యాలయాలతోపాటు డివిజన్‌, మండల కార్యాలయాలకూ ఇది వర్తింపజేసింది. అక్కడి పరిస్థితిని బట్టి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పించింది. రెగ్యులర్‌ ఉద్యోగులే కాకుండా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు, అనుబంధ సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. సోమవారం నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. గజిటెడ్‌ ఉద్యోగులకు దాదాపుగా ప్రత్యేక గదులు ఉన్న నేపథ్యంలో వారు రెగ్యులర్‌గా కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. అంతేకాదు, ు వీలైనంత వరకు ఆఫీసులకు సందర్శకులు రాకుండా చూడాలని, అర్జీలు, ఫిర్యాదులు తీసుకోవడం ఆపేయాలని సూచించింది. 


జిల్లా, డివిజన్‌, మండల స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపు ఉద్యోగులు ఒక వారం మొత్తం కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారు. ఆ సమయంలో మరో గ్రూపు ఇంట్లోనే ఉంటూ విధులు నిర్వహిస్తుంది. మరుసటి వారం మొదటి గ్రూపు ఇంటికి పరిమితం అయితే రెండో గ్రూపు ఆఫీసులకు హాజరవుతుంది. ఇంటి దగ్గర నుంచి పనిచేసే వారు ఫోన్‌లో కచ్చితంగా అందుబాటులో ఉండాలి. వారి ఫైల్స్‌ను ఈ- ఆఫీసు విధానంలోనే పంపాలి.


ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేశారు. ఉదయం 9:30 గంటలకు వచ్చే ఉద్యోగులు సాయంత్రం 4:30 వరకు, 10 గంటలకు వచ్చే వారు 5 గంటల వరకు, 10:30కు వచ్చేవారు 5:30 వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత కొనసాగుతున్న వారంతా ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-03-23T10:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising