ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దిరెడ్డి, జేసీ ఇద్దరిది తప్పే: ఆదినారాయణరెడ్డి

ABN, First Publish Date - 2020-12-25T21:17:32+05:30

ఏపీలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఏపీలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పందించారు. తాడిపత్రిలో పెద్దిరెడ్డి, జేసీ ఇద్దరిది తప్పేనని చెప్పారు. పెద్దారెడ్డి రచ్చకు పోయి చర్చలకు వెళ్లానని చెప్పడం విచిత్రంగా ఉందని కొట్టిపారేశారు. పెద్దారెడ్డికి ప్రత్యక్షంగా పోలీసుల సహకారం ఉందని ఆరోపించారు. ఈ సంస్కృతి పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. 


జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి పెద్దారెడ్డి వెళ్లడం, దీనిపై ఇరువర్గాల మధ్య సాగిన భీకర రాళ్ల దాడులతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం కొన్నిగంటలపాటు అట్టుడికిపోయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంట్లోకి  కేతిరెడ్డి తన అనుచరులతో దూసుకెళ్లారు. ఇళ్లంతా కలియతిరుగుతూ వీరంగం సృష్టించారు. అక్కడున్న జేసీ అనుచరుడు దాసరి కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా.. అక్కడే కాసేపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొని హల్‌చల్‌ చేశారు. ఈ వ్యవహారమంతా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డు అయింది.

Updated Date - 2020-12-25T21:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising