ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖులను తాకిన కరోనా

ABN, First Publish Date - 2020-08-01T10:49:06+05:30

జిల్లాలో కరోనా విజృంభణ మరింత పెరిగింది. రాజ కీయ, వ్యాపార ప్రముఖులు బాధితులవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైరస్‌ బారిన పడగా, తాజాగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యశాలలో చికిత్స పొందుతున్న చీరాల ఎమ్మెల్యే బలరాం

ఆయన కుమారుడు వెంకటేష్‌కు పాజిటివ్‌

మంత్రి బాలినేనికి సాధారణ జ్వరం

కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌ ఫలితం 

తాజాగా మరో 328 కేసులు

ఇద్దరు మృతి.. 79 మంది డిశ్చార్జి


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): జిల్లాలో కరోనా విజృంభణ మరింత పెరిగింది. రాజ కీయ, వ్యాపార ప్రముఖులు బాధితులవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైరస్‌ బారిన పడగా, తాజాగా మరికొందరు ఆ జాబితాలో చేరారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జ్వరంతో బాధపడుతూ పరీక్షలు చేయించుకోగా నెగటివ్‌ వచ్చింది. ఆయన వైరల్‌ ఫీవర్‌ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. సీనియర్‌ నాయ కుడు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కూడా హడావుడిగా చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఒక వైద్యశాలలో చేరారు. ఆయన కుమారుడు వెంకటేష్‌కు కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. మరికొందరు రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఇటు హైద రాబాద్‌, అటు బెంగళూరుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, శుక్రవారం జిల్లాలో 328 పాజిటివ్‌లు నమోద య్యాయి. ఇద్దరు మృతిచెందారు.


79మంది వైద్యశాలల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,638కి చేరింది. 727మంది చికిత్స పొందుతున్నారు. హోం క్వారంటైన్లలో 40మంది ఉన్నా రు. శుక్రవారం ఒంగోలులో మృతిచెందిన ఇద్దరిలో ఒక జర్నలిస్టు ఉన్నారు. కాగా మంత్రి బాలినేనికి మూడు రోజుల క్రితం జ్వరం రాగా హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాలకు వెళ్లారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వ హించారు. తిరిగి గురు, శుక్రవారాల్లో మరికొన్ని పరీక్షలు  చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు కరోనా నెగెటివ్‌ అని నిర్ధారించి వైరల్‌ ఫీవర్‌గా తేల్చారు. చీరాల ఎమ్మెల్యే బలరాం గన్‌మెన్‌కు, ఇంట్లో పనిమనిషికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలడంతో ఆయన, ఆయన కుమారుడు కూడా హైదరాబాద్‌లో పరీక్షలు చేయించు కున్నాడు. కుమారుడు వెంకటేష్‌కు కరోనా వైరస్‌ లక్ష ణాలు లేనప్పటికీ పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అతని కుటుంబ సభ్యులతోపాటు, చీరాలలో తనతో తిరిగిన వారందరికీ పరీక్షలు చేయించుకోవాలని వెంకటేష్‌ సూచించారు.


బలరాంనకు శుక్రవారం కొన్ని పరీక్షలు చేశారు. ఆయన పరీక్షల ఫలితం శనివారం వస్తుందని వైద్యులు తెలి పారు. ఇతర పరీక్షల కోసం ఆయన హైదరాబాద్‌లోని ఒక వైద్యశాలలో చేరారు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలోని ఇతర రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు వచ్చాయి. 

Updated Date - 2020-08-01T10:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising