ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పామూరులో కరోనా కలకలం

ABN, First Publish Date - 2020-04-14T11:07:52+05:30

పామూరు పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకిందనే అనుమానాలు రేగడంతో పట్టణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు వ్యక్తులను రిమ్స్‌కు తరలింపు 


పామూరు, ఏప్రిల్‌ 13:  పామూరు పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకిందనే అనుమానాలు రేగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 8వ తేదీన పామూరుకు చెందిన ఓ వ్యక్తిు గుడ్లూరులోని తమ బంధువుకు క్యాన్సర్‌ వ్యాధి ఉందని మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లేందుకు పామూరు నుండి కారును మాట్లాడుకొని వెళ్లారు. ఆమెను కారులో ఎక్కించుకొని ఒంగోలులో వైద్యం చేయించి అక్కడి నుంచి మరో వాహనంలో అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.


ఆమె అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందింది. మృతురాలికి కరోనా వైరస్‌ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే పామూరు నుంచి కారులో వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకి ఉంటుందని అనుమానంతో ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి డాక్టర్‌ కె కామాక్షయ్య సలహా మేరకు ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. అనుమానిత కుటుంబ సభ్యులను సైతం పామూరులోని క్వారంటైన్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-04-14T11:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising