ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శీతల గిడ్డంగుల్లోని మిరప నిల్వలు పరిశీలన

ABN, First Publish Date - 2020-11-06T09:05:02+05:30

రైతులకు వ్యాపారులు అమ్మిన మిరపవిత్తనాలు నకిలీవి అయితే నష్టపరిహారం వస్తుందని సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ సి.వెంకటరమణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(రూరల్‌), నవంబరు 5: రైతులకు వ్యాపారులు అమ్మిన మిరపవిత్తనాలు నకిలీవి అయితే నష్టపరిహారం వస్తుందని సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ సి.వెంకటరమణ తెలిపారు. ఒంగోలు నగరం త్రోవగుంటలోని శ్రీమహలక్ష్మి శీతలగిడ్డంగిలో రైతులు నిల్వచేసి న మిరపకాయలను గురువారం ఆయన పరి శీలించి పరీక్షల కోసం నమూనాలను సేకరిం చారు. గత ఏడాది దేవరంపాడు, బీవీపాలెం గ్రామాలకు చెందిన రైతులు భద్రాచలం దగ్గర ఒక వ్యాపారకేంద్రం నుంచి ఓ కంపెనీకి చెం దిన మిరప విత్తనాలను తెచ్చి సాగు చేశారు.


అయితే నాసిరకం దిగుబడులు వచ్చాయి. ఎ క్కువగా తాలుకాయలు వచ్చి ఎకరాకు ఐదా రు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని వ్యవసాయ ఉన్న తాధికారులకు బాధిత రైతులు ఫిర్యాదు చే శారు. ఈక్రమంలో గుంటూరు లాంఫాం శాస్త్ర వేత్త వెంకటరమణ శీతలగిడ్డంగుల్లో ఉన్న మి రపకాయలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ సుభాషిణ, హార్టికల ్ఛర్‌ ఏడీ ఐ.వెంకట్రా వు. ఏవో కిషోర్‌బాబు, ప్రత్యూష పాల్గొన్నారు.

Updated Date - 2020-11-06T09:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising