ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 3లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-09-13T09:49:03+05:30

తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యంను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ. 3 లక్షల విలువైన వివిధ బ్రాండ్‌ల 27 కేస్‌ల మద్యంతోపాటు, ట్రాలీ ఆటో ను స్వాధీనం చేసుకొన్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చిప్స్‌, లేస్‌ ప్యాకెట్‌ల కింద ఉంచి రవాణా

  ఇద్దరు  అరెస్టు  జూ  ట్రాలీ ఆటో స్వాధీనం అద్దంకి


సెప్టెంబరు 12: తెలంగాణ  నుంచి నెల్లూరు జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యంను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ. 3 లక్షల విలువైన వివిధ బ్రాండ్‌ల 27 కేస్‌ల మద్యంతోపాటు, ట్రాలీ ఆటో ను  స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌చౌదరి తెలిపిన వివరాల మేరకు..  నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గుడ్లవల్లూరుకు చెందిన దాసరి కిషోర్‌, కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంకు చెందిన జాన్‌ పూడి సునీల్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చిట్యాలలోని సిం ధుజ వైన్స్‌లో మద్యాన్ని కొనుగోలు చేశారు.


దాన్ని ట్రాలీ ఆటోలో  చిప్స్‌, లేస్‌  ప్యాకెట్ల కింద ఉంచి నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దన కొండూ రుకు తరలిస్తున్నారు. సమాచారం అందడంతో ఎస్‌ఈబీ అద్దంకి సీఐ శ్రీని వాసులు, ఎస్సైలు వలి, ఆంజనేయుల శనివారం ఉదయం సంత మాగు లూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. 27 కేసుల్లో ఉన్న 381 బాటిళ్ల వివిధ బ్రాండ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.  ఆటోను సీజ్‌ చేశారు. కిషోర్‌, సునీల్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. వారిద్దరూ కలిగిరి మండలం సిద్దనకొండూరులోని బాలకోటయ్య, నర్రావుల అంకిరెడ్డిల కు మద్యం సరఫరా చేసేందుకు తీసుకువెళ్తున్నట్లు విచారణలో తేలిందని శ్రీనివాస చౌదరి తెలిపారు.  

Updated Date - 2020-09-13T09:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising