సరిపోని ట్యాంకర్లు.. ఎండిపోతున్న బోర్లు
ABN, First Publish Date - 2020-03-22T09:08:32+05:30
నగర పంచాయతీలో నీటి సమస్య తీవ్రంగా మారింది. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న సరిపోవడం లేదు. ఎండలు ముదరడంతో నివాసాల్లోని బోర్లు...
- నీటి కోసం అల్లాడుతున్న ప్రజలు
కనిగిరి టౌన్ మార్చి 21 : నగర పంచాయతీలో నీటి సమస్య తీవ్రంగా మారింది. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న సరిపోవడం లేదు. ఎండలు ముదరడంతో నివాసాల్లోని బోర్లు ఎండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు నగర పంచాయతీలోని 20 వార్డుల్లో 45 వేల మందిపై బడి జనభా ఉండగా 12 వేల నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో 8 వేల దాకా బోర్లు ఉండగా 5 వేలకు పైన ఎండిపోయాయి. కేవలం నగర పంచాయతీ అందించే ట్యాంకర్ల నీటి సరఫరా పైనే ప్రజలు ఆధారపడుతున్నారు.
ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు..
నగర పంచాయతీ 20 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తోంది. నివాసాల్లో దాదాపు బోర్లు ఎండిపోవడంతో పట్టణంలోని ప్రతి ఇంటికి ట్యాంకర్ నీరే ఆధారమైంది. దీంతో వారు పూర్తి స్థాయిలో నీరు అందించలేకపోతున్నారు. కొంత ఆర్థిక శక్తి గల వారు ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి నీటిని తెచ్చుకుంటుండగా పేద వర్గాలు ప్రభుత్వ ట్యాంకర్ల నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. నివాసాల్లో ఎండిపోయిన బోర్ల స్థానంలో మరింత లోతు వేయించడం, రీఫ్రషింగ్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నా 600 అడుగులు లోతు వేసినా నీటి ఛాయలు కనిపించడంలేదు. బోర్లు లోతువేయడానికి డబ్బు ఖర్చు చేయడమే తప్పా నీరు అందకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఎన్జీవో, శివనగర్‌కాలనీ, బీసీ కాలనీ, పాతూరు, మంగళమాన్యం వంటి ప్రాంతాల్లో ట్యాంకర్లను మరింతి నీటి సరఫరా పెంచాల్సిన అవసరం ఉంది. మార్చి చివరల్లోనే నీటి సమస్య ఇలా ఉంటే రానున్న రెండు మూడు నెలల్లో మరింత తీవ్రం ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం..
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. శివారు కాలనీల్లోనూ పూర్తి స్థాయిలో నీరు అందిస్తున్నాం. వేసవి కావడంతో సహజంగానే సమస్య తీవ్రంగా ఉంటుంది. నీటి సరఫరాకు పూర్తి స్థాయిలో నిధులు అందుబాటులో ఉన్నాయి. ట్యాంకర్లు ఏ ప్రాంతానికి రాకపోయినా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి.
- డీవీఎస్ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్
Updated Date - 2020-03-22T09:08:32+05:30 IST