ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ విఫలం

ABN, First Publish Date - 2020-12-25T05:35:34+05:30

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నా రు.

కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న డాక్టర్‌ ఉగ్ర, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

దళిత  యువతి హత్యను నిరసిస్తూ

టీడీపీ శ్రేణుల కాగడాల ప్రదర్శన 

కనిగిరి, డిసెంబరు 24 :  వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి  అన్నా రు. అనంతపురం జిల్లాలో దళిత యువతి హత్యను నిరసిస్తూ పట్టణంలో ఉగ్ర ఆధ్వ ర్యంలో టీడీపీ శ్రేణులు గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన  నిర్వహించారు. అనంత రం స్థానిక పామూరు  బస్టాండ్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భం గా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ అనంతపురం జిల్లా ధర్మవరంలో దుర్గార్గుల చేతుల్లో దళిత యువతి బలైపోవడం ఎంతో దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే మహిళల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. మహిళలపై వరుస అఘా యిత్యాలు జరుగుతున్నా  ముఖ్యమంత్రి ఎం దుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. పోలీ సులు సకాలంలో స్పందించకపోవడంతోనే రాష్ట్రంలో ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నా రని అన్నారు. వేధింపులపై యువతి తల్లిదం డ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవ డం వలనే ఈ అఘాయిత్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువతిని అతి కిరాతకంగా హతమార్చిన నిందితులను ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని, లే దంటే ఇలాగే ఈ ప్రభుత్వం కూడా దమన కాండకు గురవుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని డాక్టర్‌ ఉగ్ర డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు యాదవ్‌, బేరి పు ల్లారెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, వివిఆర్‌ మనోహర్‌రావు, తమ్మినేని వెంకటరెడ్డి, రాచ మల్ల శ్రీనివాసులరెడ్డి, జక్రయ్య, గండి కోట రమేష్‌, మధు, రిజ్వాన్‌, తమ్మినేని శ్రీని వాసు లరెడ్డి, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పా ల్గొన్నారు.  


Updated Date - 2020-12-25T05:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising