ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టోల్‌ప్లాజా సిబ్బంది నాపై దాడి చేశారు’

ABN, First Publish Date - 2020-12-10T21:54:32+05:30

లోకల్ టోల్‌గేట్‌ పాస్ ఉన్నా అనుమతించలేదని.. కాజా టోల్‌గేట్‌ సిబ్బంది మా డ్రైవర్‌ను దూషించి కొట్టారని వడ్డెర ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: లోకల్ టోల్‌గేట్‌ పాస్ ఉన్నా అనుమతించలేదని.. కాజా టోల్‌గేట్‌ సిబ్బంది మా డ్రైవర్‌ను దూషించి కొట్టారని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి తెలిపారు. టోల్‌ప్లాజా సిబ్బంది నాపై అకారణంగా దాడి చేశారని చెప్పారు.  కేవలం ఐదు నిమిషాల సీసీ ఫుటేజీ మీడియాకు విడుదల చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.  నా ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే సిబ్బందిని నెట్టానని చెప్పారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. 


అంతకు ముందు జరిగిన విషయం ఇది..

వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి రెచ్చిపోయారు. ‘నా కారే ఆపుతారా?’ అంటూ కాజా టల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్‌గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు. కోపంతో కారు దిగిన ఆమె టోల్ సిబ్బందిపై రెచ్చిపోయారు. బారికేడ్‌ను పక్కకు నెట్టేసి, సిబ్బందిపై చేయి చేసుకున్నారు. రేవతి హడావిడితో టోల్‌గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. టోల్ ఫీజు నుంచి ఆమెకు మినహాయింపు లేకపోయినప్పటికీ టోల్ కట్టకుండా వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో టోల్ గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డంపెట్టి ఆమె కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారు దిగిన ఆమె పై విధంగా రెచ్చిపోయారు. ఈ ఘటనపై టోల్ ప్లాజా సిబ్బంది ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2020-12-10T21:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising