వరద వస్తోంది.. ఖాళీ చేయండి!
ABN, First Publish Date - 2020-10-14T08:52:03+05:30
ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి తాడేపల్లి మండల రెవెన్యూ అధికారులు మంగళవారం మరోసారి నోటీసులు...
- బాబు ఇంటికి మళ్లీ నోటీసులు
- కరకట్ట వెంబడి 30 నివాసాలకు కూడా
తాడేపల్లి టౌన్, అక్టోబరు 13: ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి తాడేపల్లి మండల రెవెన్యూ అధికారులు మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎగువ జలాశయాల నుంచి వరద నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న కరకట్ట లోపలి నివాసాలకు ప్రమాదం ఉందని, వెంటనే ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే కరకట్ట వెంట ఉన్న మరో 30 నివాసాలకు కూడా నోటీసులిచ్చారు. కృష్ణా నదికి భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో బ్యారేజీ ఎగువ, దిగువన నదీతీరంలో ఉన్న అన్ని కట్టడాలూ ముంపునకు గురయ్యే అవకాశం ఉందని.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోటీసులు అందజేశామని తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
Updated Date - 2020-10-14T08:52:03+05:30 IST