ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయమే కావాలంటే బిక్షమెత్తి ఇస్తాం...అంతేకానీ: దుర్గా భవానీ

ABN, First Publish Date - 2020-05-08T18:17:35+05:30

ఆదాయమే కావాలంటే బిక్షమెత్తి ఇస్తాం...అంతేకానీ: దుర్గా భవానీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రభుత్వానికి ఆదాయమే కావాలి అనుకుంటే ఇంటింటికీ తిరిగి బిక్షం ఎత్తి ఇస్తామని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవాని అన్నారు. శుక్రవారం 'కరోనా కొరడా..మద్యం అమ్మకాలు' అంశంపై ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గా భవానీ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం మద్యం షాపులు తెరవడమేంటని ప్రశ్నించారు. మద్యం షాపుల వద్ద కిలో మీటర్ల మేర క్యూలైన్‌లు ఉంటున్నాయని... దీని వల్ల వైరస్ ప్రభలితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ విపత్కర పరిస్థితుల్లో మద్యం షాపులను  ప్రారంభించడమేనా మద్యపాన నిషేధం అని మండిపడ్డారు. షాపులు తెరవడం వల్ల ఇళ్లల్లో గృహ హింస జరుగుతోందన్నారు. ప్రభుత్వం మద్యం షాపులు మూసివేయాలని లేనిపక్షంలో మహిళలే తగిన బుద్ధి చెపుతారని దుర్గా భవాని హెచ్చరించారు. 

Updated Date - 2020-05-08T18:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising