ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు ఇక లేరు

ABN, First Publish Date - 2020-10-14T14:38:41+05:30

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి వార్త విని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.


కూచిపూడి నాట్య కళాకారిణిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శోభానయుడు.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన ఆమె.. చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలు చేయడం ప్రారంభించారు. నాట్య ప్రదర్శనల్లో తన ప్రతిభను చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలెన్నో గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాదాపు 40 ఏళ్ల పాటు వేల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె లేరనే వార్త విని ఆమె శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.

Updated Date - 2020-10-14T14:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising