ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టులోంచి పాలన చేయలేరు

ABN, First Publish Date - 2020-05-30T07:28:18+05:30

‘‘ప్రభుత్వానికీ కొన్ని హక్కులుంటాయి. కానీ అక్కడనుంచే నియామకాలు చేసేసుకుంటామంటే ఎలా? అలా అయితే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కడ నుంచే నియామకాలా!

నిత్య జోక్యం.. ఇది పాలన 

ముందుకు సాగకుండా చేయడమే

సర్కారుకూ కొన్ని హక్కులుంటాయి

హైకోర్టు తీర్పుపై స్పీకర్‌ తమ్మినేని 

పాలనను కోర్టులోంచి చేయలేరు

ప్రభుత్వానికీ కొన్ని హక్కులుంటాయి: స్పీకర్‌


శ్రీకాకుళం, మే 29(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వానికీ కొన్ని హక్కులుంటాయి. కానీ అక్కడనుంచే నియామకాలు చేసేసుకుంటామంటే ఎలా? అలా అయితే ఈ ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు ఎందుకు? ప్రజలే సుప్రీం. ఎక్కడికక్కడే జోక్యం చేసుకుంటామంటే... ఇదంతా పరిపాలన ముందుకు సాగనివ్వకుండా చేసే ప్రయత్నం. ఇది తప్పు. వ్యవస్థలు ముందుకు వెళ్లాలి. కోర్టులకూ అధికారాలున్నాయి. అయితే ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశం కోర్టులకు ఉంది. వ్యవస్థలపై పౌరులకు హక్కుంటుంది. ఈవాళ ప్రజల మధ్య ఇదే విషయమై చర్చలు జరుగుతున్నాయి.  దీనిపై అందరూ ఆలోచించుకోవాల్సిందే’’ అంటూ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.


శుక్రవారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘మనది సున్నితమైన రాజ్యాంగం. ఎన్నికల కమిషన్‌ ఏమి చేయాలన్నదీ ప్రభుత్వం హక్కు. ఇందులో జోక్యం చేసుకోకూడదు. అయినా జోక్యం చేసుకున్నారు. పూర్తిగా తీర్పు అందనివ్వండి. అప్పుడు మాట్లాడుతా. కచ్చితంగా మాట్లాడాలి కూడాను. లేదంటే అది ఇంకోవైపునకు దారితీస్తుంది’’ అని తమ్మినేని అన్నారు. పాలనను కోర్టులోంచి చేయలేరన్నది తన అభిప్రాయమన్నారు. 

Updated Date - 2020-05-30T07:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising