ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైపులైన్ల లీకేజీలపై పురపాలకశాఖ ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2020-12-11T07:33:19+05:30

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, డైనేజీ పైపులైన్లన్నీ ఎలాంటి లీకుల్లేకుండా ఉండేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, డైనేజీ పైపులైన్లన్నీ ఎలాంటి లీకుల్లేకుండా ఉండేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరులో వింత వ్యాధి ఘటన దృష్ట్యా ప్రభుత్వం ఈ చర్యలకు తీసుకుంది. ఇప్పటికే ఒకరు మరణించడంతోపాటు.. వందలాది మంది బాధితులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.


దీనికి కారణాలేమిటన్నది ఇంకా నిర్ధారణ కానప్పటికీ.. కలుషిత నీరు, ప్రమాదకర రసాయనిక అవశేషాలు కలిగిన కూరగాయలు లేదా పాల వల్ల వింతవ్యాధి ప్రబలిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ఆదేశాల మేరకు తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లను తనిఖీలు చేసి, లీకేజీలుంటే అరికట్టి, మార్చాల్సి ఉంటే మార్చేందుకు పట్టణ సంస్థలు సమాయత్తమవుతున్నాయి.

Updated Date - 2020-12-11T07:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising