మోసం చేశారని రియల్ ఎస్టేట్ యాజమాన్యంపై ఫిర్యాదు
ABN, First Publish Date - 2020-05-17T10:31:05+05:30
పట్టణంలోని నాలుగురోడ్ల కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన పీఎస్‌ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ సంస్థ
టెక్కలి, మే 16: పట్టణంలోని నాలుగురోడ్ల కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన పీఎస్‌ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ సంస్థ మోసం చేసిందని పేర్కొంటూ మెళియాపుట్టి మండలం కొత్తమారడికోట గ్రామానికి చెందిన పెద్దింటి శ్రీను టెక్కలి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... శ్రీరామ్‌నగర్ పేరుతో వేసిన వెంచర్‌లో 106 నెంబర్ బిట్‌కు రూ.8.60 లక్షలకు గాను మార్చి 20న శ్రీను రూ.20 వేలు చెల్లించాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ జరగలేదు. శనివారం మిగిలిన మొత్తం చెల్లిం చేందుకు ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లగా 106 నెంబర్ బిట్ వేరొకరికి విక్రయించామని, దాని బదులు వేరొక స్థలం ఇస్తామని ఏజెంట్ తెలపడంతో శ్రీను ఖంగుతిన్నా డు.
తాను ఎంచుకున్న బిట్ ఇంకొకరికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించినా సమాధానం కరువైంది. తనకు జరిగిన మోసంపై విచారణ చేసి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై ఎస్‌ఐ గణేష్ వద్ద విలేక రులు ప్రస్తావించగా సదరు సంస్థపై ఫిర్యాదు అందడం వాస్తవమేనన్నారు. విచారణ చేపడతామని చెప్పారు. అలాగే రియల్‌ఎస్టేట్ అండ్ డవలపర్స్ ఉద్యోగి గొల్ల సిం హాచలం వద్ద ప్రస్తావించగా ఒక స్థలం బదులు మరొక స్థలానికి సంబంధిత ఏజెంట్ అడ్వాన్స్ తీసుకు న్నారని, తప్పిదం జరగడం వాస్తవమేనని బదులిచ్చారు. ఇదిలా ఉండగా పీఎస్‌ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డవలపర్స్ రైస్‌విల్లులు మధ్య వేశారని, దీనిపై ఇప్పటికే పలువురు మిల్లర్లు సైతం గతంలో ఆర్డీవో స్థాయి అధికారికి ఫిర్యాదు చేశారు.
Updated Date - 2020-05-17T10:31:05+05:30 IST