ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హుల పింఛన్లు తొలగిస్తారా?

ABN, First Publish Date - 2020-05-10T08:36:54+05:30

అర్హుల పింఛన్లు తొలగించడం సరికాదని జామి మేజర్‌ పంచాయతీ ఈవో రమణను మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈవోను నిలదీసిన మాజీ జడ్పీటీసీ పెదబాబు


శృంగవరపుకోట రూరల్‌ (జామి), మే 9: అర్హుల పింఛన్లు తొలగించడం సరికాదని జామి మేజర్‌ పంచాయతీ ఈవో రమణను మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు నిలదీశారు. ఆయన శనివారం ఈవోను తన కార్యాలయంలో కలసి పింఛన్ల పంపిణీ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, వారు చెప్పిన వారికే పింఛన్లు ఇవ్వడం, అర్హుల పింఛన్లు తొలగించడం సరికాదన్నారు.


ఈవో అంటే హుందా నడుచుకోవాలని, ప్రజల కోసం పనిచేయాలి కానీ...  అధికార పార్టీ నాయకుల కోసం కాదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. మరోసారి ఇలా జరిగితే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈవో మాట్లాడుతూ.. తాము న్యాయంగా వెళ్తున్నామని, అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నామన్నారు. తాను ఎవ్వరికీ అనుకూలంగా పనిచేయడం లేదని, తనపై నిందలు వేయడం సరికాదన్నారు. ఈవోను కలిసిన వారిలో టీడీపీ నాయకులు లోకవరపు అప్పారావు, వర్రి రమణ, రాధాకృష్ణ, అప్పలనాయుడులు ఉన్నారు.

Updated Date - 2020-05-10T08:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising