ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు మహర్దశ

ABN, First Publish Date - 2020-12-29T04:25:01+05:30

జిల్లాలో ఆర్‌ అండ్‌బీ రోడ్లు బాగుపడనున్నాయి. వీటి మర మ్మతు లకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులతో పా టు నిధులను కూడా కేటాయించింది.

దెబ్బతిన్న రోడ్డు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ

జిల్లాలో 65 పనులకు అనుమతి

రూ.13 కోట్లతో మరమ్మతులు

ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 28: జిల్లాలో ఆర్‌ అండ్‌బీ రోడ్లు బాగుపడనున్నాయి. వీటి మర మ్మతు లకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులతో పా టు నిధులను కూడా కేటాయించింది. జిల్లాలో అత్యం త దారుణంగా దెబ్బతిన్న రహదారులను  ప్రాధాన్య క్రమంలో బాగు చేయనున్నారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. దాదాపు రూ.13 కోట్లను ఈ మరమ్మతులకు కేటాయించారు. వీ టిలో జిల్లా, గ్రామీణ రహదారులతో పాటు రాష్ట్ర రహ దారులు కూడా ఉన్నాయి. అతిత్వరలో మరమ్మతుల పనులు చేపడతామని ఆర్‌ అండ్‌ బీ అధికారులు పేర్కొన్నారు.

205 కిలోమీటర్ల మేర పనులు

జిల్లా, గ్రామీణ పరిధిలో ఉన్న 205 కిలోమీటర్ల మే ర రోడ్లను ఈ నిధులతో బాగుచేయనున్నారు. రూ.9 కోట్లతో 52 పనులకు ఆర్‌అండ్‌బీ ఆమోద ముద్ర వేసింది. వీటిలో ప్రధానంగా నాయుడువారిపాలెం - జరుగులవారిపాలెం రోడ్డుకు రూ.80 లక్షలు, మానే పల్లి - పుల్లలచెరువు మార్గానికి రూ.56 లక్షలు, కొ ప్పోలు - మోటుమాల రహదారికి రూ.35 లక్షలు కే టాయించారు.  ఒంగోలు - చంద్రపాలెంకు రూ.35 లక్షలు, తిక్కరాజుపాలెం-చెరుకూరుకు రూ.40లక్షలతో మరమ్మతులు చేపట్టనున్నారు.

రూ.4 కోట్లతో రాష్ట్ర రహదారుల పనులు

రాష్ట్ర రహదారులను బాగు పరచడానికి దాదాపు రూ.4 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 66 కిలో మీటర్ల మేర 13 పనులకు ఈ నిధులను వెచ్చించ నున్నారు. అనుమతి లభించిన రోడ్లలో ముఖ్యంగా కం భం - గిద్దలూరు రహదారికి రూ.57 లక్షలు, పర్చూరు - ఇంకొల్లుకు రూ.50 లక్షలు, గుంటూరు--పర్చూరుకు రూ.50 లక్షలు, టంగుటూరు-పొదిలికి రూ.18 లక్షలు, వాయిలేటిపాలెం--కామేపల్లి-కొండపికి రూ. 30లక్షలు, బాపట్ల - పర్చూరుకు రూ.42 లక్షలు కేటాయించారు. ప్రాధాన్యక్రమంలో ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేపడతామని అధికారులు తెలిపారు. నివర్‌ తుఫాన్‌ దాటికి దెబ్బతిన్న రహదారులన్నింటిని బాగు చేస్తా మని పేర్కొన్నారు.  ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు తెలిపారు.


Updated Date - 2020-12-29T04:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising