ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులదే : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-07T05:45:01+05:30

పాఠశాలలకు వచ్చే విద్యార్థులు కరోనా బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ నివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ, నవంబరు 6 : పాఠశాలలకు వచ్చే విద్యార్థులు కరోనా బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. శుక్రవారం స్థానికంగా పెదకాపువీధి హైస్కూల్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలను కలెక్టర్‌ సందర్శించారు. విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించి, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. అనంతరం నీలమ్మకాలనీలో గల సచివాలయాన్ని సందర్శించారు. అందిస్తున్న సేవల బోర్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో మంచినీటి కొళాయి పన్నులను వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌, ప్రత్యేకాధికారి బి.రాజగోపాల్‌, డీఎల్‌పీవో ప్రభావతి, ప్రిన్సిపాల్‌ కృష్ణారావు, ఎంపీడీవో ఆనందరావు, కమీషనర్‌ శివప్రసాద్‌, ఎస్‌ఐ జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు. 

  ఆమదాలవలస : స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఉన్న 7వ నెంబరు సచివాలయాన్ని కలెక్టర్‌ జె.నివాస్‌ శుక్రవారం సందర్శించారు. కమిషనర్‌ రవిసుధాకర్‌, తాహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు, ఎంపీడీవో పి.వెంకటరాజు తదితరులు ఉన్నారు.

  

Updated Date - 2020-11-07T05:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising