ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం తీర్పు నేపథ్యలో సీఎం జగన్‌కు కేశినేని శ్వేత ట్వీట్

ABN, First Publish Date - 2020-03-18T20:49:09+05:30

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పు పడుతూ సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు జగన్ సర్కార్‌కు చెంపపెట్టని వ్యాఖ్యానిస్తున్నాయి.


ఇదిలా ఉంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని తనయురాలు, టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ.. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. రాజకీయాలు పక్కనపెట్టి కనీసం ఇప్పుడైనా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించండి. మాస్కులు, శానిటైజర్లని ఉచితముగా పంపిణీ చేయండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2020-03-18T20:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising