ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విదేశాల నుంచి వచ్చినవారు నేరుగా క్వారంటైన్‌కు’

ABN, First Publish Date - 2020-05-10T21:52:45+05:30

విదేశాల నుంచి వచ్చినవారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విదేశాల నుంచి వచ్చినవారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తామని విజయవాడ ఎయిర్ పోర్టు డైరెక్టర్ మదుసూధనరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ విదేశాలలో ఉండిపోయినవారిని స్వదేశాలకు తీసుకువచ్చేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు.


వందే భారత్ ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కున్నవారిని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని మదుసూధనరావు తెలిపారు. ఏపీకి సంబంధించి విజయవాడ, విశాఖ, తిరుపతికి మూడు విమానాలు వస్తున్నాయన్నారు. సోమవారం మొదటి విమానం విజయవాడకు వస్తుందన్నారు. అయితే వారిని నేరుగా క్వారంటైన్‌కు పంపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. వారి బంధువులు, కుటుంబ సభ్యులు కూడా కలుసుకునే అవకాశం ఉండదని మదుసూధనరావు స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-10T21:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising