ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ధన దాహానికి బుడమేరు వద్ద గ్రామాలు ముంపులో ఉన్నాయి: దేవినేని

ABN, First Publish Date - 2020-07-15T22:47:00+05:30

వైసీపీ ధన దాహానికి బుడమేరు వద్ద గ్రామాలు ముంపులో ఉన్నాయి: దేవినేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 17330 కోట్లతో రాష్ట్ర బడ్జట్ పైభారం పడకుంగడా ఉపాధి నిధులను సద్వినియోగం చేసుకుని నీరు - చెట్టు, నీరు - ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టామని దేవినేని అన్నారు.ఈ పథకం ద్వారా సాగునీటి పారుదల రంగంలో అనేక జాతీయ అందర్జాతీయ అవార్డులు వచ్చాయని, గ్లోబల్ వాటర్ కన్జర్వేషన్ అవార్డ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు టీడీపీ ప్రభుత్వానికి వచ్చాయని దేవినేని ఉమ పేర్కొన్నారు. ఉపాధిహామి పథకం ద్వారా కూలీలకు వెళ్లాల్సినా రూ.4500 కోట్లు వైసీపీ నాయకులు పంది కుక్కుల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. మైలవరం నియోజక వర్గం జి-కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో 130 ఎకరాలను ఎకరం రూ. 45 లక్షలు లెక్కన కొని దోచుకున్నారని మండిపడ్డారు.


బుడమేరు ముంపు సాకుతో రూ. 13 కోట్ల రూపాయల ఉపాధి నిధులను వైసీపీ నాయకుల బంధువులకు దోచిపెట్టారని దేవినేని మండిపడ్డారు. నిజంగా పనులు చేసి ఉంటే రూ. 13 కోట్లతో వేసిన ముంపు మేరువు ఎందుకు కొట్టుకుపోయిందని? దేవినేని ప్రశ్నించారు. వైసీపీ ధన దాహానికి బుడమేరు దగ్గర అనేక గ్రామాలు ముంపులో ఉన్నాయని, మైలవరంలానే అనేక నియోజకవర్గాలలో ఇలాంటి అవినీతికి వైసీపీ వాళ్లు పాల్పడుతున్నారని, నివాసయోగ్యం కానీ మీరు కొనుగోలు చేసిన భూములపై విచారణ చేపట్టాలని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.


Updated Date - 2020-07-15T22:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising